మండుటెండలో సైతం ఆత్మీయ అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-65పై ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
నేడు సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను రెండో రోజు విచారించనున్నారు. పోలీసులు తమ కస్టడీలో సతీష్‌ను ప్రశ్నలు అడగనున్నారు. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన జరగుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పెద్ద శంకరంపేటలో సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఈరోజు ఉదయం…
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం అచ్చంపేట జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా…
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్లంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగం లోకి దిగాల్సిందేనని తీర్మానించుకుని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. రాజీనామాలు అనంతరం వీరంతా పార్టీ కార్యకర్తల్లా మారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…
నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది.
కర్నూలు జిల్లా కోడుమూరులో పుష్ప సినిమా సీన్ తరహాలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుజికి క్యారియర్ వాహనాన్ని నిందితుడు మాడిఫికేషన్ చేసి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు.