ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ బ్యానరుకు 164 బిందెలతో పాలాభిషేకం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు.
YSR Health University: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సభ్యులు ఉభయసభల్లో ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్, మండలిలో పోడియం వద్దకు దూసుకొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన కూడా తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలనాలను కూడా చేశారు. Manipur: మణిపూర్లో రెండు…
కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
పల్నాడులో నేటి నుండి 5వ తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ చేయనున్నట్లు తెలిపారు పోలీసులు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కౌంటింగ్ డే రోజు నరసరావుపేటను, అష్టదిగ్బంధం చేయనున్నారు పోలీసులు.. జూన్ 4న కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించే ముందు రాజకీయ అభ్యర్థులందరి ఎన్నికల ఏజెంట్లకు మద్యం పరీక్షలు నిర్వహిస్తామని.. పాజిటివ్ వచ్చిన వారిని హాల్లోకి అనుమతించబోమని పల్నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మాలిక గార్గ్ హెచ్చరించారు. జూన్…
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డయేరియాతో కాకుండా…
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అనంతరం ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలోనే జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు, ఛాంబర్లను జీఏడీ హ్యాండోవర్ చేసుకోనుంది
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో జారీ చేసిన మోమోలను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు మేము వెళ్లడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదని, నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చని, ఉద్యోగులంతా తమ వెనుకే…
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాఖలైన మూడు అదనపు కేసుల్లో రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం ఈవీఎం పగులగొట్టిన కేసులో కోర్టు నుంచి ఉపశమనం పొందిన కొద్దిసేపటికే పోలీసులు తనపై మూడు…