Botsa Satyanarayana: జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు. హింసను ప్రోత్సహించవద్దంటూ సూచించారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ గొడవను అనవసరంగా రాజకీయ రాద్దాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..
ఓ అధికారిని నియమించే ముందు పూర్వ పరాలు చూస్కోవాలని.. అలా కాకుండా నియమించడం వల్లే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అంతే కానీ అభద్రత భావంతో కాదన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. 175 సీట్లకు దగ్గరగా సంపాదిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారన్నారు. అవి అధికారిక భవనాలు అన్న ఆయన.. వాటిని అధికారికంగానే ఉపయోగిస్తామన్నారు. గెలుపు మీద నమ్మకం లేకనే మహానాడులు రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. మా మీద ఆధారపడే కేంద్రం ప్రభుత్వం రావాలన్నారు. ఉత్తరాంధ్రలో 34కి 34 సీట్లు వస్తాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.