ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు, గొడవలు కారణంగా ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుటోంది. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బంధీగా చేసేందుకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎలక్షన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
నమ్మించి మోసం చేసింది ఓ మాయలేడి. కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసింది మాయలేడి. గుడివాడలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలంటూ రూరల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్ , నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు.
ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
ఫైర్ క్రాకర్స్ పై అనంతపురం జిల్లాలో తాత్కాలికంగా నిషేధం విధించారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి సిఫారసు మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు టపాసుల తయారీ, కొనుగోలు, అమ్మకాలు, రవాణా వంటి వాటిపై కలెక్టర్ నిషేధం విధించారు.
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే ఇంకా మకాం వేసింది. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు.
ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే ప్రకటించినట్లుగా బుధవారం నుంచి అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి.అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు కన్నయ్యపై దాడులు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నారు.