Chandrababu: డోన్‌లో ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: నంద్యాల జిల్లా డోన్‌లో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పిట్టకథల మంత్రికి, కట్టుకథల నేతలకు కాలం చెల్లిందన్నారు. అప్పులు చేసేది బుగ్గన…అప్పులు కట్టేది జనమని.. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడన్నారు. విధ్వంస పాలనకు, అభివృద్ధికి ఈ ఎన్నికలు సవాల్ అంటూ ఆయన పేర్కొన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. గర్వం పెరిగిపోయి అహంకారంతో విధ్వంసం చేస్తున్నారని.. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ప్రజల ఆస్తులు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీకి కాలం చెల్లిపోయిందని.. డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. పాలన అంటే బుగ్గన హరికథలు చెప్పడం కాదన్నారు. రాయలసీమకు ఏమి చేసాడని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు.
Read Also: Amit Shah Video: సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు.. అమిత్ షా వీడియోపై విచారణ..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
మీ పట్టాదారు పసుపుస్తకాలపై జగన్ ఫోటో వేసుకుంటాడా.. ఆస్తి వాళ్ళ తాత ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. ప్రజల భూములన్నీ జగన్ పేరుతో రాసుకుంటున్నాడని.. ఇది చాలా ప్రమాదకరమని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూమి మీరు కాపాడుకోవాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని.. మద్యం ధరలు పెరిగాక చేసిన కూలి డబ్బులు తక్కువ వచ్చి భార్య దగ్గర లాక్కుంటున్నారని చంద్రబాబు అన్నారు. కరెంటు చార్జీలు 9 సార్లు పెరిగాయని.. తాను వస్తే కరెంటు చార్జీలు ఉండవు, కరెంటు కోతలు ఉండవన్నారు. తాను వస్తే చెత్త పన్ను రద్దు చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు. విశ్వసనీయత లేదని చెప్తున్నారు.. తన విశ్వసనీయత ఏ మారు మూలకు వెళ్లినా తెలుస్తుందని చంద్రబాబు తెలిపారు. పదేళ్లయినా రాజధాని లేదని ఆయన మండిపడ్డారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!