Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-65పై ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ 65వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలలో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సుమారు14 కోట్లు విలువైన 66 కేజీల బంగారు వెండి ఆభరణాలను పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. బీవీసీ లాజిస్టిక్ వాహనంలో విజయవాడలోని మలబార్, కళ్యాణ్, లలిత తదితర జ్యువెలరీ దుకాణాలకు అందజేసేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఇన్‌కమ్ టాక్స్, జీఎస్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: Gam Gam Ganesha: ‘ గం..గం..గణేశా ‘ అంటున్న ఆనంద్ దేవర కొండ.. న్యూ మూవీ అప్డేట్..
అయితే పట్టుబడిన ఆభరణాలన్నిటికీ అన్ని రకాల బిల్లులు ఉండటం విశేషం. సమాచారం అందుకున్న గ్రామీణ సీఐ పి. చంద్రశేఖర్, ఎస్సై సుబ్రహ్మణ్యం, ఎస్‌బీ సీఐ సురేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సంఘటనాస్థలం వద్దకు వెళ్లి పరిశీలన జరిపారు. పట్టుబడిన 66 కేజీల 740 గ్రాముల గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కలిపి టోటల్ వాల్యూ 14 కోట్ల 11 లక్షల 99 వేల 897 రూపాయలుగా బిల్లులు తెలుపుతున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలు లేకపోవడంతో, హైదరాబాదు నుంచి రోడ్డు ద్వారా వెండి బంగారు ఆభరణాలను బీవీసీ లాజిస్టిక్స్ ద్వారా ద్వారా విజయవాడ తరలిస్తున్నారు.