గుంటూరులో భారీగా బంగారం దోపిడీ: గుంటూరు జిల్లా మంగళగిరి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. దాదాపుగా ఐదు కిలోల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. శనివారం రాత్రి మంగళగిరి మండలం ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు కేజీల 900 బంగారం దోచుకెళ్లారని భాదితుడు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.4 కోట్ల విలువైన బంగారం ఉంటుందని పోలీసులకు తెలిపాడు. విజయవాడ డీవీఆర్ జ్యూవెలరీ షాపు నుంచి మంగళగిరికి యజమాని రాము బంగారం…
నేడు కర్నూలులో పలు అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేయనున్నారు. నేడు కాళహస్తీశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలపై హోంమంత్రి అనిత సమీక్షించనున్నారు. మధ్యాహ్నం అధికారులతో భద్రత ఎర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. నేడు కృష్ణా జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగనుంది. మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయలు…
ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంలో అలసత్వం అరచేతి మందాన పేరుకుపోతోందా? సీఎం స్పీడ్…స్పీడ్… అంటున్నా, వాళ్ళు మాత్రం మన్నుతిన్న పాముల్లా కదులుతున్నారా? తీరు మార్చుకోవాలని సీఎం పదేపదే చెబుతున్న మాటలు ఉన్నతాధికారుల చెవికెక్కడం లేదా? నేను 95 సీఎంని అవుతానన్న చంద్రబాబు ప్రకటనలు కేవలం మాటలేనా? ఆ… అయినప్పుడు చూద్దాంలే అని ఆఫీసర్స్ అనుకుంటున్నారా? అసలు ఏపీ సెక్రటేరియెట్‌లో ఏం జరుగుతోంది? నాలో… మళ్ళీ.. నైన్టీ ఫైవ్ సీఎంని చూస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారోగానీ….…
బర్డ్ ఫ్లూపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం: దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైందని, ఈ గెలుపు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్యపెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. ప్రజలు సుపరిపాలనకు అవకాశం కల్పించారన్నారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని…
దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైందని, ఈ గెలుపు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్యపెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. ప్రజలు సుపరిపాలనకు అవకాశం కల్పించారన్నారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారన్నారు. ఢిల్లీ, ఏపీ…
మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమావేశం: మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భేటీ జరగనుంది. రెండు సెషన్లుగా ఈ సమావేశం జరగనుంది. మొదటి సెషన్లో ఫైళ్లు క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీపై చర్చ జరగనుంది. రెండో సెషన్లో కేంద్ర బడ్జెట్ సహా త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్‌పై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిచనున్నారు. శాఖల…
నేడు విజయవాడలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారు. ఈరోజు నెల్లూరులో మంత్రి సవిత పర్యటించనున్నారు. ఈరోజు శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీస్వామి అమ్మవారి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు స్వర్ణరథంలో విహరిస్తూ భక్తులకు శ్రీస్వామి అమ్మవారు దర్శనమివ్వనున్నారు. కర్నూలులోని కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరునాళ్ల మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ మూనట్ వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాక్‌థాన్ నిర్వహించనున్నారు. రాష్ట్ర రవాణా…
ఏపీఎస్ఆర్టీసీకి బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ప్రసంశలు కురిపించారు. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అంటూ కితాబు ఇచ్చారు.