భారీ భద్రత మధ్య గ్రూప్-2 పరీక్షలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గ్రూప్-2 ప్రధాన పరీక్ష జరగనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. టైం దాటితే…
ఈరోజు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రేణిగుంటలో టీడీపీ నేత నరసింహ యాదవ్ కుమారుడి వివాహానికి, నెల్లూరులో బీద రవిచంద్ర కుమారుడి రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం హాజరుకానున్నారు. ఈరోజు సాయత్రం 5 గంటలకు జనసేన శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. నేడుఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యం అయింది.
కడప కార్పొరేషన్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కడప ఎమ్మెల్యే మాధవి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే కంప్లంట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. తాజాగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.
మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని…
పక్కింటావిడపై హత్యాయత్నం: వివాహేతర సంబంధం బయటపడుతుందన్న అనుమానంతో పక్కింట్లో నివాసం ఉంటున్న మహిళపై ప్రియుడు, ప్రియురాలు కలిసి హత్యాయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణపర్తికి చెందిన పొలిమేర దీపిక పిల్లలతో కలిసి మునగపాక ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కన రాజ్‌కుమార్, సరిత దంపతులు ఉంటున్నారు. అచ్చుతాపురంలో ఓ కంపెనీలో రాజ్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. భర్త రాజ్‌కుమార్ డ్యూటీకి వెళ్లిన తర్వాత తన ప్రియుడిని సరిత ఇంటికి రప్పించుకుంటోంది.…
నేడు శ్రీశైలంలో 3వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో శ్రీస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంకాలం హంసవాహనంపై శ్రీస్వామి, అమ్మవారు పూజలందుకోనున్నారు. చికెన్, గుడ్లు వినియోగంపై ఫ్రీ చికెన్ మేళాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మేళాలు నిర్వహించనున్నారు. అపోహలను తొలగించడమే ఈ మేళాల లక్ష్యం. నేటి నుండి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొదటి పూజ స్వామి వారి ప్రథమ భక్తుడైన భక్త కన్నప్ప ధ్వజారోహణంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం…
కేంద్ర జల్‌శక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ: ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు, పవన్ సమావేశం అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ.12 వేల కోట్లు కేటాయించగా.. నిధులు విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. మరోవైపు పోలవరం కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు…
పాలకొండకు వైఎస్ జగన్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకోనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఇటీవల వైసీపీ సీనియర్…
ఆలూరులో నిరుద్యోగ యువతి, యువకులకు ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే ౠర్ల రామాంజనేయులు పాల్గొననున్నారు. నేడు శ్రీశైలంలో రెండవరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజ జరగనుంది. ఈరోజు ఆదికవి నన్నయ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా ప్రసన్న శ్రీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలి ఎస్టీ మహిళగా అరుదైన గుర్తింపు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని…