ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ను రాజేంద్ర ప్రసాద్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఇద్దరూ నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజేంద్రను పవన్ ఆలింగనం చేసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని డిప్యూటీ సీఎం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
READ MORE: Leopard Dies: ప్రకాశం జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. కొనసాగుతున్న దర్యాప్తు..