వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి…
వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు.
గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి కుటుంబం రూ.8 లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. జగన్ దుబారా, జల్సాలకు ప్రభుత్వ ధనం రూ.19,871 కోట్లు వృథా చేశారని మండిపడ్డారు.
గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1.34 వేల మంది సచివాలయాల్లో పని చేస్తున్నారన్నారు. ఏక పక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో సేవలు చెయ్యడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు.
భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో రెవెన్యూ.. ఎండోమెంట్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాం. సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. కానీ పూర్తి చేయలేకపోయారు.. ప్రస్తుతం పంచ గ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు…
అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతాం: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ డా.నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీహరికోటలో బుధవారం ప్రయోగించే జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా సాగుతోందన్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతాం అని తెలిపారు. శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే…
కష్టపడిన వారికే ప్రాధాన్యత: 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని పార్టీ ముఖ్య నాయకులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సూచించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహించాలని, పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూసే బాధ్యత ఎమ్మెల్యేలదే అని సీఎం పేర్కొన్నారు. త్వరలో 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎంపీలు,…
నా గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తుపట్టా అని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. గతంలో తనకు న్యాయం జరగదు అనే భావం ఉండేదని.. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. "పీవీ సునీల్ కుమార్ వెనుక ఉన్న ఆర్మీని చూసి భయపడుతున్నారా? వాళ్ల దగ్గర ఏమైనా తుపాకులు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతూ ఉంది..
ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది. వ్యవస్థాపక ఛైర్మన్‌గా టీజీ వెంకటేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో ఏర్పాటు చేశాం. సినీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం.తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది.మద్రాస్ లో రాయలసీమ వాళ్లు పెద్ద,పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు
విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారు: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఏదో ఒత్తిడితో రాజీనామా చేయించారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభ స్థానానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయటం బాధాకరం అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ కష్ట కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. రాజ్యసభ పోయినా పర్లేదు, పార్టీకి సేవ చేయమని తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు విజయసాయి రెడ్డి శనివారం…