Israel-Khamenei: ఖమేనీ హత్య వెనుక ఇంత జరిగిందా? వెలుగులోకి సంచలన రిపోర్ట్
- ఖమేనీ హత్యపై సంచలన రిపోర్ట్
- వెలుగులోకి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నతమైన హోదాలో ఉన్న నాయకుడు. ప్రపంచంలో గుర్తింపు ఉన్న నేత. అలాంటి నాయకుడిని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా అంతమొందించాయి. ఈ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ఒక నాయకుడిని గుట్టుచప్పుడు లేకుండా లేపేయడంతో ప్రపంచమంతా కలవరానికి గురి చేసింది. తాజాగా మర్డర్ వెనుక మిస్టరీ వెలుగులోకి వచ్చింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 90 రోజుల క్రితమే ఖమేనీని చంపేయాలని ప్రణాళిక రచించినట్లుగా తెలిపారు. 2025 నవంబర్‌లో అంతమొందించాలని ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. కానీ అప్పుడు కుదరలేదని.. జనవరిలోనైనా అమలు చేయాలనుకున్నామని.. అంతలోనే ఇరాన్‌లో అల్లర్లు మొదలయ్యాయని.. ఈ గందరగోళం మధ్య ప్లాన్ వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మధ్యలో ప్లాన్ అమలు చేయాలని ఆలోచన చేస్తుండగా ఫిబ్రవరి 28న అత్యవసరంగా ప్లాన్ అమలు చేయాల్సి వచ్చిందని వివరించారు.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన చాలా చిన్న, రహస్యమైన సమావేశంలో అత్యంత వేగంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి చివరిలో అమెరికాతో కలిసి మొదటి గంటల్లోనే ఖమేనీని అంతమొందించినట్లుగా చెప్పారు. ఖమేనీని చంపేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టి్క్ క్షిపణులు ఇజ్రాయెల్ ఉనికికి ముప్పు కలిగిస్తాయని ఇజ్రాయెల్ భావించిందని.. అందుకే ఖమేనీని చంపడమే తమ ముందన్న లక్ష్యంగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను పూర్తిగా నాశనం చేయగల ఆయుధాలను ఇరాన్ అభివృద్ధి చేసిందని.. అందుకే దాని మూలల నుంచే తొలగించాలని భావించినట్లుగా చెప్పారు.
ఇరాన్‌లో పాలన మార్పును ఇజ్రాయెల్ కోరుకుంటోందని.. ప్రస్తుత ప్రభుత్వం కూలిపోవాలన్నారు. కొత్తగా శాంతియుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇరాన్ ఎన్నుకునే నాయకుడు.. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుంటాడని.. ఇజ్రాయెల్‌ను నాశనం చేసే ఏ నాయకుడిని సహించబోమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ ఇంకా అధికారాన్ని వదులుకోలేదని.. పైగా ఎదురుదాడికి దిగుతోందన్నారు. దీంతో చమురు సరఫరాలకు అంతరాయం కలిగిస్తున్నాయని చెప్పారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయన్నారు. ఇరాన్ ముప్పు తొలగిపోయే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..