పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందంటూ కితాబు ఇచ్చారు.
పేదల ఆదాయాన్ని పెంచడమే తన అభిమతం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లె గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా రాష్ట్రంలోని సమస్యలను కేంద్రానికి చెప్పారని తెలిపారు. వాటికి కేంద్ర బడ్జెట్ ద్వారా పరిష్కారమయ్యాయన్నారు. జల్‌జీవన్ మిషన్ ప్రధానికల నిజం కాకుండా గత సర్కార్ చేసిందని విమర్శించారు. జల్‌జీవన్ మిషన్ ను పొడిగించారని చెప్పారు.
సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.
రిపబ్లిక్ డే రాష్ట్రాల శకట ప్రదర్శనలో ఏపీ శకటానికి థర్డ్ ప్లేస్ వచ్చింది.. ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్‌తో ఏపీ శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది.. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్), రెండో స్థానంలో త్రిపుర (14 దేవతల ఖర్చి పూజ) నిలిచాయి. రక్షణ శాఖ ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను ప్రకటించింది. మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో దిల్లీ పోలీసు కవాతు బృందానికి…
ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియామకమయ్యారు. హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్‌కు చెందిన అధికారి. గత ఎన్నికల ముందు హరీష్‌కుమార్‌ను ఈసీ డీజీగా నియమించింది. ఈ నెల 31తో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ముగియనుంది.
కాకినాడ లో ఏపీ హోటల్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వీరి మధ్య చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. హోటల్ ఓనర్లకు శుభవార్త చెప్పారు.
నరసరావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పుంగనూరు ఎస్టేట్‌పై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుంగనూరులో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాబైకోట్లు పరువు నష్టం దావా వేసినట్లు గుర్తుచేశారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్థానికుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. "సొంత డబ్బులతో కొన్న దానిపై అసత్య ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా. వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు. 2001లోనే అక్కడ ఇళ్ళు కట్టాం..