ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలన్న ఏపీ సర్కార్ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. అంతేకాకుండా జగన్న విద్యా దీవెన పథకం పై కూడా కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్ కోటాలో నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది.
యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు కూడా జగనన్న విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. యాజమాన్య కోటాను కూడా కన్వీనర్ కోటాగా భర్తీ చేస్తారని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలపై రాయలసీమ డీగ్రీ కళాశాల యాజమాన్యం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఏపీలోని చాలా కాలేజీల్లో ఇకనుంచి యాజమాన్య కోటాలో సీట్లు ఇదివరకు లాగానే భర్తీ కానున్నాయి.