ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది.జగన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాలేదు..దీంతో రావలసిన నిధుల విషయం లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం లభించింది.. విభజన హామీలు అమలు చేయకపోయినా కానీ ఎప్పటికప్పుడు నిధులిస్తూ వస్తుంది కేంద్రం.. ఇప్పుడు మరో విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం వినతిని అంగీకరించింది.ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను సరఫరా చేసేందుకు వీలుగా వేసిన విద్యుత్…
ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ.. క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు ఇవాళ్టి( ఆదివారం)తో ముగిసిపోనున్నాయి. రేపటి( సోమవారం) నుంచి స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్కు విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి సెలవులు పొడిగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షలు అందించనుండగా.. గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనుంది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.