AP DSC 2023 : ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు.. మరీ నోటిఫికేషన్ ఎప్పుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు.డిఎస్‌సి నోటిఫికేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు..అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్ గారు ప్రకటించారు..కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లు గడిచి పోయింది.గడిచిన ఈ నాలుగేళ్లలో కనీసం ఒక్క డిఎస్‌సి నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదు.డి.ఎడ్, బి.ఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయ పోస్టులు కేవలం 717 మాత్రమే ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.. కేంద్రానికి మాత్రం రాష్ట్రంలో సుమారు 50వేల పై చిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ నివేదిక ను పంపింది.
రాష్ట్రంలో సుమారు 14వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఒక్క టీచరే అన్ని తరగతులకూ బోధించడం ఉపాధ్యాయులకు ఎంతో భారంగా మారింది. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కనుక సెలవు పెడితే ఇక ఆ రోజు బడిని మూసివేయాల్సిందే మరీ.నెలరోజుల క్రితం మెగా డిఎస్సి ని త్వరలో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ గారు పేర్కొన్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం జూలై లేదా ఆగస్టు నాటికీ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు సేకరించి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని మంత్రి బొత్స సత్యన్నారాయణ గారు తెలిపారు.. ప్రతి ఏటా నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్షను కూడా ప్రభుత్వం నిర్వహించ లేదు. గత ప్రభుత్వం 2018 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇక ఆ తరువాత మళ్ళీ 2022లో మాత్రమే టెట్ ను నిర్వహించారు.. పాఠశాల విద్యాశాఖ 2022లో నిర్వహించిన టెట్‌కు 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,07,329 మంది హాజరయ్యారు. వీరిలో 58.07 శాతం మంది టెట్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. టెట్ ను నిర్వహించి ఏడాది పూర్తి అవుతున్న నోటిఫికేషన్ ఇంకా రాలేదు అని అభ్యర్థులు దిగులు పడుతున్నారు. మంత్రి గారు తెలిపినట్లు గా రానున్న ఆగష్టు నెల నాటికీ అయిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తారో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు