AP BJP Chief Daggubati Purandeswari Fires On AP Govt Over Development: తాము రాయలసీమ డిక్లరేషన్‌ను కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. పొత్తులపై సరైన సమయంలో జాతీయ అధ్యక్షడు నిర్ణయం తీసుకుంటాడని తెలిపారు. రాష్ట్రంలో అభవృద్ధి శూన్యమని, కేంద్రం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభత్వం ఇళ్ళ నిర్మాణం చేయడం లేదని ధ్వజమెత్తారు. 14, 15 ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని ధ్వజమెత్తారు. సర్పంచ్‌లు చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నారని విరుచుకుపడ్డారు. రాయలసీమలోని గుడ్రేవుల ప్రాజెక్ట్, సిద్దేశ్వరం అలుగు చిరకాల కల అలాగే ఉందని పేర్కొన్ననారు.
Bhatti Vikramarka: కార్మిక హక్కులను బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి
రాయలసీమ ఎత్తిపోతల పథకంలో 780 కోట్ల మేర బిల్లులు ఇచ్చారని.. కానీ పనులు మాత్రం జరగలేదని పురందేశ్వరి చెప్పారు. కనీసం ప్రాజెక్టుల మరమ్మత్తుల కూడా చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద ఇసుక అక్రమ రవాణా వల్లే గేటు కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు. గండికోట ప్రాజక్ట్ నిర్వాసితులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వకుండా నీటి నిల్వ చేశారని ఫైరయ్యారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని యువతని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ఒక్క పరిశ్రమను కూడీ ఈ ప్రభుత్వం తీసుకుని రాలేదని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంత యువత, రైతులు వలస వెళ్లి.. వేరే ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటున్నారని అన్నారు. ఓర్వకల్లులో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ను కేంద్రం పెడుతోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.
Urination Incident: ఫ్లైట్ ఫ్లోర్‌లో మహిళ మూత్ర విసర్జన.. ఎయిర్‌లైన్ సిబ్బంది వల్లేనట..!