జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహారమే కారణం అని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం వారం వారం సమీక్షల మీద ఉన్న శ్రద్ధ.. ఉద్యోగులకు నిధులు, కనీస సౌకర్యాలు కల్పించడంపై ఉంటే బాగుండేది అని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ( శుక్రవారం ) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి- అమలాపురం మండలం జనుపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన మహాధర్మలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహించారు. సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు
ఏపీలో నిధుల కోసం సర్పంచులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఏపీ బీజేపీ మద్దతు ఇచ్చింది. సర్పంచ్ల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయనుంది.