Driving Fine: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే.. రూ. 20,000 జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 Thousand Fine For Riders If They Wear Earphones While Driving: ప్రస్తుత తరం యువత సెల్‌ఫోన్లకు ఎంతలా అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అవసరానికి వాడాల్సిన ఆ పరికరాన్ని.. తమ జీవితంలో ఒక భాగం అయ్యేంతలా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అసలు సెల్‌ఫోన్ లేకపోతే.. క్షణం కూడా ఉండలేమన్నంతగా అడిక్ట్ అయిపోయారు. చివరికి రహదారుల్లోనూ సెల్‌ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నారే తప్ప.. వాహనాల్ని, మనుషుల్ని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఏదైనా రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందేమో? అనే భయం లేకుండా పోయింది. అంతెందుకు.. వాహనం నడుపుతున్నప్పుడు కూడా, ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటారు. ఇలా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వాహనాలు నడుపుతున్నప్పుడు.. వెనకాల వచ్చే వాహనాల హార్న్ శబ్దం వినిపించదు. అప్పుడు అనుకోకుండా ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంది. ఈ తరహా సంఘటనలు గతంలో చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఆమోదించిన లోక్‌సభ స్పీకర్
Also Read
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ఇకపై ఇలా జరగకుండా ఉండేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ.. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా వేయనుంది. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే.. ఏపీ ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకొని వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారని.. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలంటే, భారీ ఫైన్ వేయక తప్పదని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి.. వాహనదారులారా? తస్మాత్ జాగ్రత్త! సరదా కోసమని చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుంటే మాత్రం.. జేబుకి భారీ చిల్లు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తేలిగ్గా తీసుకోకుండా, తూ.చ. తప్పకుండా పాటిస్తే మంచిది.
Daggubati Purandeswari: బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుంది.. ఉమ్మడి సీఎం అభ్యర్థిపై వారిదే నిర్ణయం
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!