Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు గానీ, రైతు కూలీలు పంటకు కావాల్సిన ఎరువుల కోసం ఎంతలా కొట్లాడారో చూశాం.. బ్లాక్ మార్కెట్ లో ఎరువులు కొనుక్కొని పంట పండించిన పరిస్థితి ఏర్పడింది.
నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ జరుగుతుంది.. అందులో ఎంతటి వారున్నా వదిలి పెట్టే సమస్య లేదన్నారు. అలాగే, మద్యం షాపుల్లో బార్ కోడ్ స్కానింగ్ పెట్టాం.. బార్ కోడ్ స్కానింగ్ పెట్టిన తరువాత నకిలీ బాటిల్స్ బయట పడలేదని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. తక్కువ ఆదాయ వృద్ది, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు.
Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, అక్టోబర్ 11వ తేదీన బనకచర్ల ప్రాజెక్ట్ డీపీఆర్ కోసం టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం.. ఇక టెండర్ల దాఖలుకు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది సర్కార్.. తాజాగా డీపీఆర్ కోసం ఆహ్వానించిన టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. అయితే, బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో.. డీపీఆర్ టెండర్ల…
మీ అందరి అభిమానాన్ని చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందని టీమిండియా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి చెప్పారు. అందరి ఆశీర్వాదంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025 గెలిచాం అని తెలిపారు. వరల్డ్కప్లో సమిష్టిగా రాణించాం అని, టీమ్ అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యం అయిందన్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని, ముందు చాలా ఉందని తెలుగు తేజం శ్రీ చరణి చెప్పుకొచ్చారు. వన్డే ప్రపంచకప్లో శ్రీ చరణి సత్తా చాటిన విషయం తెలిసిందే.…
టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్, కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీ చరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారంను ప్రకటించింది. అంతేకాదు పాటు గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలంను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో శ్రీ చరణి స్వయంగా చెప్పారు. మహిళా వన్డే ప్రపంచకప్లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టులో శ్రీ చరణి సభ్యురాలు అన్న విషయం తెలిసిందే. Also Read: Ambati Rambabu: కూటమి ప్రభుత్వానికి…
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వబోతున్నట్లు పేర్కొనింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇక, ఒక డీఏ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత విద్యా సాగర్ మాట్లాడుతూ..…
AP Govt: ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఉద్యోగుల సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు.