Srinivas Goud Challenges Botsa Satyanarayana Over Development: తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. బొత్స కాపీ కొట్టి పరీక్షలు రాశారు కాబట్టే అలాంటి కామెంట్స్ చేశారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే.. అక్కడసుతో బొత్స ఆ మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఏపీ నాయకులందరూ తమ మూతి తాము కడుక్కుంటే మంచిదని సూచించారు. పోటీ పరీక్షల్లో ఏపీ రాజధాని ఏంటి? అని అడిగితే.. సమాధానం రాయలేని పరిస్థితి ఆ రాష్ట్రానిదని ఎద్దేవా చేశారు. తెలంగాణ విద్యార్థులు, ఏపీ విద్యార్థుల మధ్య పోటీ పరీక్షలు పడితే.. అసలు ట్యాలెంట్ బయటపడుతుందని వ్యాఖ్యానించారు. APPSCలో ఆనాడు స్కామ్స్ చేసిన చరిత్ర వాళ్ళదని, డబ్బుల కట్టలతో లాడ్జీలన్నీ నిండేవని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇంజినీరింగ్ కాలేజీలకు తాళాలు వేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదని చెప్పారు.
Suchitra Krishnamoorthi: ఈ రాత్రికి నాతో పడుకో.. తెల్లారి ఇంటిదగ్గర దింపుతా అన్నాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విడిపోవడానికి కారణం.. బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులేనని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తిరుమలలో కూడా వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తూ.. భక్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. బొత్స వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని సెటైర్ వేశారు. ఏపీలో కులాల పిచ్చి, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని తాము ఎప్పుడైనా అన్నామా? అని ప్రశ్నించారు. తాను ఎక్కడికి రమ్మన్నా వస్తానని.. నేను విజయవాడ కనకదుర్గమ్మలో గానీ, తిరుపతిలో గానీ అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. గతంలో స్కాంలు జరిగాయని, అవే స్కామ్‌లు ఇప్పటికీ జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ అనుకుంటున్నారేమోనని కౌంటర్ వేశారు. తమ విద్యా వ్యవస్థను, విద్యార్థులను బొత్స అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు బొత్స హైదరాబాద్‌కు వచ్చినా సరేనని పేర్కొన్నారు.
AP v/s TS: మమల్ని రెచ్చగొట్టద్దూ.. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు సీరియస్..
కాగా.. ఆఫ్ర్టాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కామ్‌లు జరిగాయో చూశామని, అన్ని చూచిరాతలేనని అన్నారు. ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో కూడా వార్తలు వస్తూనే ఉన్నాయన్నారు. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని.. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదని పేర్కొన్నారు. ఈ విధంగా బొత్స చేసిన వ్యాఖ్యలకే శ్రీనివాస్ గౌడ్ పై విధంగా కౌంటర్ ఎటాక్ చేశారు.