గత ఎన్నికల లో గెలుపుని లక్ష్యం గా చేసుకొని ప్రభుత్వ ఉద్యోగుల కు కొన్ని హామీలను ప్రకటించారు జగన్. అందులో అతి ముఖ్యమైనది సిపిఎస్ విధానంను రద్దు పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే సిపిఎస్ విధానం రద్దు చేస్తానంటూ గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అనుకున్నట్లు గానే జగన్ గత ఎన్నికలలో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత గాని తెలియలేదు సిపిఎస్ విధానం రద్దు ఎంతో కష్టతరమైన పని అని..సిపిఎస్ పై అవగాహన లేక జగన్ ఎన్నికలలో అలాంటి హామీ ఇచ్చారు అన్న సజ్జల వ్యాఖ్యలపై మండిపడి ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టారు.. అయితే ఉద్యోగ సంఘాల నిరసనలు ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు.. దాంతో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య కాస్త గ్యాప్ పెరిగిపోయింది . ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వచ్చే ఎన్నికలలో తమకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అని గ్రహించిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఆహ్వానం పంపింది..
ఉద్యోగ సంఘాల తో జరిపిన చర్చలలో భాగముగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం అలాగే సెక్రటేరియట్ ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించడం వంటివి చేసారు. అతి ముఖ్యమైన సిపిఎస్ విధానం రద్దు అలాగే దాని స్థానంలో మెరుగైన జిపిఎస్ విధానాన్ని తీసుకురావడం అలాగే సెలవులను ఎన్కాష్మెంట్ చేసుకునే పద్ధతిని కూడా ప్రవేశపట్టడం ఇలా కొన్ని ఉద్యోగ వర్గాలను ఆకట్టుకునే చర్యలు తీసుకుంది. దీంతో ఉద్యోగులలో ప్రభుత్వం పై వున్న అసంతృప్తి కొంతమేర తగ్గినట్టు వార్తలు కూడా వచ్చాయి.. వచ్చే ఎన్నికలలో ఉద్యోగ సంఘాల నుంచి తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తుంది.ఉద్యోగ సంఘాల వారు ప్రస్తుతానికి సమ్మె విరమించాయి. ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్లలో కొన్నింటిని అయిన నేరవేర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపి నిరసన కార్యక్రమాల్ని విరమించాయి. ఉద్యోగ సంఘాలు.