Purandeswari: నిర్మలా సీతారామన్‌కి పురంధేశ్వరి లేఖ.. జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా.. సీఎం జగన్, వైసీపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ఇక, తాజాగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖరాశారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.. వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తోందంటూ ఫిర్యాదు చేశారు.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏయే విధంగా అప్పులు చేసిందనే వివరాలను లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రూ.7.15 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకుందని లేఖలో వెల్లడించారు. ఉద్యోగులకివ్వాల్సి పీఎఫ్ క్లైమ్స్.. డీఏలు కూడా భారీగా పెండింగులో ఉన్నాయన కేంద్ర ఆర్థికమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు పురంధేశ్వరి. లిక్కర్ ఆదాయం తాకట్టు పెట్టి ఇప్పటికే తీసుకున్న అప్పులే కాకుండా మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని లేఖలో స్పష్టం చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న ఆర్థిక అవకతవకలపై సమీక్షించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను లేఖలో కోరారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
కాగా, ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని గతంలో పురంధేశ్వరి తెలిపిన విషయం విదితమే.. ఏపీకి కేంద్రం 25 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని.. గడచిన తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లు ఒక్క పీఎమ్‌ఏవై కింద ఇచ్చిందని తెలిపారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌కి ఎన్‌ఆర్‌జీపీ కింద 2022 – 23 వరకు 8 వేలకు కోట్లకు పైగా వచ్చాయని.. రాష్ట్రంలో 90 లక్షల మందికి ఉచిత బియ్యం అందుతోందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.. ఈ ఏడాది బియ్యం ద్వారా 10 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి అందిందన్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రూ.12 వేలు ఇస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు.. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.46,836 కోట్లు గ్రాంట్లు ద్వారా రాష్ట్రానికి అందిస్తుందని.. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచ్‌ల అకౌంట్‌లలోకి నిధులు విడుదల చేస్తుంటే ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎం జగన్‌పై పురంధేశ్వరి ధ్వజమెత్తిన విషయం విదితమే.
Also Read
- Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
- Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
- Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
- India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
తాజావార్తలు
-
Dhamaal 4: ఓటీటీలో దుమ్మురేపుతున్న 200 కోట్ల అడ్వెంచర్ కామెడీ.. గాంధారిని వెనక్కి నెట్టి నెం.1లో ట్రెండింగ్
-
TFPC Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు నిర్మాతల మధ్య వాగ్వాదం
-
JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
-
Nandamuri Mokshagna : నేడు చిన్న సింబా బర్త్ డే.. ఎంట్రీ అప్డేట్ ఉంటుందా ?
-
Fatima Sana: భారత్‌తో మ్యాచ్‌లో అదే మా కొంపముంచింది.. ఏడ్చేసిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!