Pawan Kalyan: 2019-21 మధ్య 30వేల మంది బాలికలు,మహిళలు అదృశ్యమయ్యారని కేంద్రమంత్రి చెప్పారని.. ఇప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బాలికలు, మహిళలు ఎందుకు అదృశ్యమవుతున్నారని ప్రశ్నించారు. దీనిపై హోంమంత్రి , డీజీపీని.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వివరణ అడగగలదా? చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోగలదా చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళలు అదృశ్యం అయ్యారని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. 2019-21లో 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యం అయ్యారు.. అసలు బాలికలు, మహిళలు ఎందుకు అదృశ్యమౌతున్నారు? అని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
Read Also: DGP Rajendranath Reddy: ఆ జిల్లాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయి-డీజీపీ
మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ…రెండు రాష్ట్రాల్లో కలిపి మూడేళ్లలో 72వేల 767 మంది బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని స్పష్టం చేసింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదశ్యమైనవారిలో 15వేల 994 మంది బాలికలున్నారని, 56 వేల773 మంది మహిళలున్నారని కేంద్రం స్పష్టం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్న కేసులో ఏటా పెరుగుతున్నాయని నివేదికలో ప్రస్తావించారు. ఏపీలో 2019 నుంచి 2021వరకు మూడేళ్లలో 7వేల 928 మంది బాలికలు. .22వేల 278 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఆ మూడేళ్లలో.. తెలంగాణలో 8వేల 66 మంది బాలికలు, 34 వేల 495 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొన్న తెలిసిందే.
మహిళలు… బాలికల అదృశ్యంపై @ysjagan సర్కార్ ఇప్పుడేం చెబుతుంది? – JanaSena Party PAC Chairman Shri @mnadendla#WakeupAPMahilaCommission #SaveAPfromYCP pic.twitter.com/PRD5OdZJUY
— JanaSena Party (@JanaSenaParty) July 26, 2023