భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. మునెపెన్నడూ చూడని విధంగా ఏపీలో వరదలు పోటెత్తాయి. వరద ప్రభావంతో గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుకున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాదిగా పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుపతిలో కనివిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు సంభవించాయి. అయితే సీఎం జగన్…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండగా మారి ఏపీలో విజృంభించింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలకు 28 మంది మృతి చెందగా, 17 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారికోసం అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులకు గండ్లు పడడంతో వరద నీరు గ్రామాల్లోకి చేరింది. 1,316 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 6.33 లక్షల ఎకరాల్లో పంట నష్టం…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి తమిళనాడుతో పాటు ఏపీపై విరుచుకుపడింది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి వరదలు సంభవించాయి. చెరువులకు గండ్లుపడి గ్రామాల్లోకి నీరు చేరుతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. కొన్ని గ్రామాలు వరద నీటి దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఈ భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలం అవుతున్న వేళ మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. Read Also : What’s…
వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం జగన్. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల, డ్రైనేజీల పూడికతీత పనులతో…
ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరులో అతిభారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రోడ్లు కొట్టకుపోయాయి. వరద నీటిలో ఇప్పటికీ దాదాపు 30 మంది గల్లంతయ్యారని అధికారులు అంటున్నారు. అయితే వరదనీటిలో చిక్కుకున్న గ్రామస్తులను కాపాడేందుకు ఓ ఎస్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణత్యాగం చేశాడు. 5వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కెల్ల శ్రీనివాస్ గ్రామస్తులను కాపాడేందుకు వరదనీటిలోకి దిగాడు. ఆ గ్రామస్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అంతలోనే తన లైఫ్ జాకెట్ వరద తాకిడికి ఊడిపోవడంతో…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులకు గండ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల వరద బీభత్సానికి రహదారులు కొట్టుకుపోయాయి. మరి కొన్ని చోట్ల రైల్వే ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. దీంతో రైళ్లను కూడా రద్దు చేశారు. నిన్నటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి తగ్గింది. ఇన్ ఫ్లో లక్షా 93వేల 710 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో…
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏపీలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా చెరువులు, కుంటలు నిండి కట్టలు తెగిపోతున్నాయి. దీంతో వరద నీరు గ్రామాల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొన్న చోట్ల చెరువులు నిండుకుండాలను తలపిస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని ప్రజలు బిక్కబిక్కుమంటూ భయాందోళనలో ఉన్నారు. అనంతరపురం కురిసిన భారీ వర్షాలకు హిందుపురంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హిందుపురం నుంచి అనంతపురం, పెనుకొండ, గోరంట్ల, లేపాక్షి, చిలమత్తారు గ్రామాలకు రాకపోకలు…
ఏపీలో వరద పరిస్థితులపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాయలసీమను వరదలు ముంచెత్తాయని… భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని సీఎం జగన్‌ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ గాల్లో నుంచి…
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో.. వరద బాధితులకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలి. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలి. పసి పిల్లలకు పాలు, బిస్కెట్స్ అందించి ఆకలి తీర్చండి అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ ,ఐ-టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాలకు ఆహారం, మందులు పంపిణీ జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను…
వాయుగుండంతో భారీ వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోని పలు జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కకున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. వరదల్లో రాజంపేట నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పొలపత్తూరు శివాలయంలో దేపారాధనకు వెళ్లి ఎంతమంది చనిపోయింది సమాచారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 మృతదేహాలు గుర్తించారని, మరికొందరు గల్లంతైనట్లు ఆయన తెలిపారు. శివాలయం ఘటనలో 11 నుంచి 12 మంది చనిపోయిండవచ్చని అంచనా వేస్తున్నట్లు…