జగన్ గాల్లో నుంచి కిందకు దిగాలి: నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో వరద పరిస్థితులపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాయలసీమను వరదలు ముంచెత్తాయని… భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని సీఎం జగన్‌ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ గాల్లో నుంచి కిందకు దిగాలని హితవు పలికారు. జగన్ నేలపైకి వస్తేనే పేదప్రజల కష్టాలు కనిపిస్తాయన్నారు.
Read Also: త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా : చంద్రబాబు
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందారని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నామని.. ఇప్పుడు నీరోకి మరో రూపమైన జగన్‌రెడ్డిని ప్రత్యక్షంగా చూస్తున్నామని లోకేష్ ఆరోపించారు. రాయలసీమ మొత్తం అకాలవర్షాలకు అల్లకల్లోలమైతే కనీసం అటువైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా జగన్‌రెడ్డికి రాలేదని లోకేష్ తప్పుబట్టారు. జగన్ సర్కారు వైఫల్యం వల్లే రాయలసీమలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకున్నాయని లోకేష్ ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!