ఏపీలో భారీ వర్షాలు ముంచెత్తతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరులో అతిభారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రోడ్లు కొట్టకుపోయాయి. వరద నీటిలో ఇప్పటికీ దాదాపు 30 మంది గల్లంతయ్యారని అధికారులు అంటున్నారు. అయితే వరదనీటిలో చిక్కుకున్న గ్రామస్తులను కాపాడేందుకు ఓ ఎస్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణత్యాగం చేశాడు. 5వ పోలీస్ బెటాలియన్‌కు చెందిన కెల్ల శ్రీనివాస్ గ్రామస్తులను కాపాడేందుకు వరదనీటిలోకి దిగాడు.
ఆ గ్రామస్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అంతలోనే తన లైఫ్ జాకెట్ వరద తాకిడికి ఊడిపోవడంతో అదుపు తప్పి వరద నీటిలో కొట్టుకుపోయి మరణించారు. శ్రీనివాస్ మరణ వార్తతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా మృతి చెందడంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.