భారీ వర్షాలు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలైతే ఇక్కడ ఊర్లు ఉండేవి అనేంతా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిలి, పశువులు కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వరద బీభత్సవానికి పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో 39 మంది…
ఏపీని వరదలు వదలనంటున్నాయి. ఏపీపై యుద్ధం ప్రకటించినట్లుగా వెనువెంటనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో సారి ఏపీకి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈనెల 28, 29 తేదీల్లో తిరుపతి, నెల్లూరు నగరాలలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. Also Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే.. సుమారు 13 సెం.మీ…
ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు దెబ్బకొట్టాయి.. నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు.. అయితే, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి కేంద్ర బృందాలు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి ఓ అంచనాకు రానున్నారు.. రేపు రాష్ట్రానికి రానున్న ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత జిల్లాల్లో పర్యటించనుంది.. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప జిల్లాలు,…
తిరుపతి : వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే… రాయలసీమ జిల్లాలలు అతలాకుతలం అయ్యాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రెండు రోజులుగా కడప, తిరుపతి లోని ముంపు ప్రాంతాలలో పర్యటించానని….చెన్నై వర్షాల ఎఫెక్ట్ కడప,చిత్తురు,అనంతపురం, నెల్లూరుపై పడిందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ సూచనలు చేసినా ఫ్రభుత్వం పట్టించుకోలేదు … వారి అనుభావరాహిత్యం ప్రజలు శాపంగా మారిందని నిప్పులు చెరిగారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు… అలాంటి అప్పుడే ప్రభుత్వ సమర్ధత తెలుస్తుందని చురకలు అంటించారు. పించా, అన్ననయ్య డ్యాంలో ఈ…
వరద బాధితులకు ప్రభుత్వం నుంచి ఏదీ ఓదార్పు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది. కూలిన ఇళ్లు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి.. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయని పేర్కొన్న ఆయన.. జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వరద గ్రామాల్లో పర్యటించి బాధితులను…
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో వరదలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో భారీ స్థాయిలో వరద నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రస్తుతం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరదల వల్ల మొత్తం రూ. 6,054 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. Read Also: ఈ…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాసారు. రాష్ట్రంలో వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టానికి ఆదుకోవాలని లేఖలో కోరారు సీఎం జగన్. ప్రాధమిక నష్ట అంచనాల నివేదికను అందులో పొందుపర్చారు ముఖ్యమంత్రి. మధ్యంతర సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు అత్యవసరంగా సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేసారు ముఖ్యమంత్రి. అలాగే నష్ట పరిహార అంచనాల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపించండి అని లేఖలో…
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని…
కడప జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరఫున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 ఇస్తామని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమని ఆరోపించారు. Read Also: విధ్వంసానికి.. సీఎం జగన్ బ్రాండ్…