భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. మునెపెన్నడూ చూడని విధంగా ఏపీలో వరదలు పోటెత్తాయి. వరద ప్రభావంతో గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుకున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాదిగా పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుపతిలో కనివిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు సంభవించాయి.
అయితే సీఎం జగన్ ఇప్పటికే భారీ వర్షాల ప్రభావంపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏపీ బీజేపీ నేతలు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అయితే తాజాగా రేపటినుంంచి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కడప జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఎల్లుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారని టీడీపీ నాయకులు వెల్లడించారు.