వాయుగుండంతో భారీ వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోని పలు జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కకున్నాయి. ఈ సందర్భంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ.. వరదల్లో రాజంపేట నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పొలపత్తూరు శివాలయంలో దేపారాధనకు వెళ్లి ఎంతమంది చనిపోయింది సమాచారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 మృతదేహాలు గుర్తించారని, మరికొందరు గల్లంతైనట్లు ఆయన తెలిపారు.
శివాలయం ఘటనలో 11 నుంచి 12 మంది చనిపోయిండవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పోలపత్తూరు, మందపల్లిలో వరద నుంచి నష్టపోయిన వారికి మేడా కన్స్ట్రాక్షన్స్ ఆధ్వర్యంలో ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి 10 వేలు చొప్పున సాయం, మృతుల కుటుంబాలకు 50 వేల నుంచి లక్ష ఆర్థికసాయం అందజేస్తామన్నారు. కడప జిల్లా వరద బాధితులందరినీ ఆదుకుంటామని సీఎం జగన్ చెప్పారన్నారు.