వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోపక్క చెరువులకు గండ్లు పడుతున్నాయి. నిన్నటివరకు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు చిత్తూరులో కొంచెం ఆగిపోయాయి. అయితే తాజాగా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మళ్లీ ఎడతెరపి లేకుండా చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా బయటకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం.. వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ తిరుచానూరు, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో వరద తాకిడికి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్థుల భవనం కూలిపోయింది. Also Read:అక్కడికి వెళ్లి ఎంతమంది చనిపోయారో తెలియడం లేదు : వైసీపీ ఎమ్మెల్యే అంతేకాకుండా…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి రోడ్లపై వరద నీరు వచ్చిచేరుతోంది. అయితే కడప జిల్లా రాజంపేటలోని చెయ్యేరు నది కట్ట తేగిపోవడంతో ఒక్కసారి రోడ్లపై వరద నీరు వచ్చింది. దీంతో రోడ్డుపై ఉన్న రెండు ఆర్టీసీ బస్సులు ముందుకు కదలలేక వరద నీటిలోనే నిలిచిపోయాయి. వరద నీరు బస్సులోకి చేరడంతో ప్రయానికులు…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరులోని 66 మండలాలో వర్షాలు కురిసాయి. 42 మండలాలో 100 మిల్లిమీటర్లు దాటిన వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పెద్దమండ్యంలో 200 మిల్లిమీటర్లు, అత్యల్పంగా పిచ్చాటురు మండలంలో 35 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అయితే తిరుపతి అర్బన్ లో 100 మిల్లిమీటర్లు, తిరుపతి రూరల్ లో 120 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో కళ్యాణిడ్యాం నిండుకుండలా మారింది.…
ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. అంతేకాకుండా తక్షణ సహాయంగా రూ.1000 వెయ్యి చొప్పున సీఎం జగన్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరాన్ని దాటింది. భారీ వర్షాలతో కళ్యాణి జలాశయం నిండుకుండాలా మారింది. పూర్తిస్థాయి…
కనివిని ఎరుగని రీతిలో జలప్రళయం ముంచుకొచ్చింది. తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చైన్నైకి ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. Also Read : వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు మహిళలు ఈ రోజు తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం…
ఏపీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో తిరుపతిలో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార పసుపుధార జలాశయాలు నిండుకుండాల మారాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం డ్యాం గేట్లను అధికారులు ఎత్తారు. కుమారధార పసుపుధార, ఆకాశగంగ జలశయాల నుంచి ఓవర్ ఫ్లోలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నీట మునగడంతో తిరుపతిలో కంట్రోల్ రూంను అధికారులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం…
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో వర్షాలు బీభత్సానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు భారీ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు, పంబలేరు వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విజయవాడ-చైన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.…