"ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు.." అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపమని.. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారని ఆయన ఆరోపించారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోందన్నారు.
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల 'మేమంతా సిద్ధం' బహిరంగ సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొదిలిలో బిందువు బిందువు చేరి సిందువు అయినట్లు జనసంద్రం కనిపిస్తుందని.. మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ప్రతీ సిద్ధం అంటున్నారన్నారు. ప్రజల అజెండాతో మనం, జెండాలు జత కట్టి వాళ్లు వస్తున్నారని విమర్శించారు.
గతంలో పొరుగు రాష్ట్రాలు చూడడానికి వెళ్లామని, ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు మన ప్రభుత్వం వైపు చూసి వెళ్తున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట శిరికి రిసార్ట్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్.కోట మండల స్థాయి విస్తృత సమావేశంలో ముఖ్యఅతిధిగా మంత్రి పాల్గొన్నారు.
మార్చి 16 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.09 కోట్లని, జనవరి 22న నమోదైన 4.07 కోట్లతో పోలిస్తే ఇది పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా శనివారం తెలిపారు. మొత్తం ఓటర్లలో రెండు కోట్ల మంది పురుషులు, 2.08 కోట్ల మంది మహిళలు, 3,346 మంది థర్డ్ జెండర్ ఉన్నారని ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలను ప్రకటించిన రోజున ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. మే 13న…
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో జోరందుకుంటుంది. ఈ క్రమంలో.. టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విజయవాడ రూరల్ గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో ఇండిపెండెంట్ సర్పంచ్ కొడాలి సుకన్య, ఆమె మద్దతుదారులు తెలుగుదేశం పార్టీలో చేరారు.