ఈ ఎన్నికల్లో విశ్వసనీయతకు.. వంచనకు మధ్య యుద్ధం నడుస్తోంది.. మీకు మంచి జరగాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పడుతున్నారు.. అవతలి పక్షం తోడేళ్లుగా మోసగాళ్లుగా వస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఓ విడియో విడుదల చేసిన ఆమె.. తాను వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇంత కాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు