చంద్రబాబు తీరు పరకాష్ఠకు చేరిందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో బాబు కలల కన్న కూటమి వికటించిందన్నారు. చంద్రబాబు ఎవరు అనుకుంటే కూటమి పార్టీ అభ్యర్థులు డిసైడ్ అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉనికి లేకుండా పోయిందన్నారు. బీజేపీలో కూడా బాబు అనుకున్నట్టే సీట్లు ఖరారు అయ్యాయన్నారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ ఓటమి చూడబోతుందన్నారు. ప్రతి ఎన్నికల సమయంలో కూడా చంద్ర బాబుకు పునకాలే అని, సైకిల్ రావాలి… సైకో పోవాలి…
ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అని, అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేద వాడు అనుకుంటాడన్నారు. సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడని, సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుందన్నారు మంత్రి అమర్నాథ్. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్..…
పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు.
గూగుల్ సెర్చ్ అనలిటిక్స్ నుండి ఇటీవలి డేటా గుర్తించదగిన ట్రెండ్‌ను వెల్లడిస్తోంది, ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్నెట్ వినియోగదారులు ఆయన రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడుతో పోలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. గత 30 రోజులు, 90 రోజుల శోధన ట్రెండ్‌ల విశ్లేషణ సీఎం జగన్ వేవ్‌ను స్పష్టంగా చూపుతోంది. గూగుల్ సెర్చ్ క్వెరీలు చూస్తే సీఎం జగన్ నాయుడిని మించిపోయారు. సీఎం జగన్ రాజకీయ ప్రొఫైల్, కార్యకలాపాలు ఏపీ…
ఆంధ్రప్రదేశ్ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఓటు ద్వారా విజయం సాధిద్దాం.. అదే విధంగా అజాతశత్రువు సేవకుడు అయినటువంటి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా క్రోసూరు, సత్తేనపల్లి బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దాచేపల్లిలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలో భాగంగా…
ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు ప్రజాగళ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ను బరిలోకి దిగిన విషయం విదితమే.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తోంది..
ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం గుండుపల్లి పంచాయతీలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 'పల్లె పల్లెకు కాకర్ల' కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్న సీపీఐ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.