Allu Arjun : అల్లు అర్జున్.. ఊహించని ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో.. మలయాళ స్టార్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్, అల్లు అర్జున్ మధ్య సాగుతున్న సాన్నిహిత్యం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. బాసిల్ జోసెఫ్ చెప్పిన ఒక వైవిధ్యమైన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఆ కథా చర్చలు తుది దశలో ఉన్నాయనే టాక్ ఉంది. అల్లు అర్జున్‌కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Also Read : Bollywood : బాలీవుడ్‌లో గతేడాది అతి పెద్ద సర్‌ప్రైజ్ హిట్ సినిమా ఇదే
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అక్కడ ఆయన్ని అభిమానులు ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. ఇప్పటికే తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్‌తో సినిమాలు చేస్తున్న బన్నీ, ఇప్పుడు తన మలయాళ మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో.. ‘మిన్నల్ మురళి’ వంటి సెన్సేషనల్ హిట్ అందించిన బాసిల్ జోసెఫ్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. తాజాగా బాసిల్ జోసెఫ్, అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సందడి చేశాడు. దీంతో.. ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ఫిక్స్ అయినట్టే.. అనే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక వినూత్నమైన సోషల్ డ్రామా లేదా సూపర్ హీరో తరహా కథను బాసిల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కలయిక గనుక కుదిరితే, అది కేవలం తెలుగు, మలయాళ భాషల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమే. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి వెళ్లడంతో, బాసిల్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో సినిమా చేయడం సరైన నిర్ణయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలంటే.. చాలా సమయం పట్టేలా ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?