ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో జోరందుకుంటుంది. ఈ క్రమంలో.. టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విజయవాడ రూరల్ గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో ఇండిపెండెంట్ సర్పంచ్ కొడాలి సుకన్య, ఆమె మద్దతుదారులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
RCB vs RR: ఆర్సీబీ మరో ఓటమి.. కోహ్లీ శ్రమ వృథా
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు అధికారులంలోకి వస్తే తప్ప.. మన రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక యువత వలస వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ఆగిపోయిన పోలవరం కట్టాలన్నా, అమరావతి రాజధాని కట్టాలన్నా, ఐటీ పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలని చెప్పారు.
Off The Record: ఈటల, రంజిత్ రెడ్డి రెండు పార్టీలలో ఉండటంపై చర్చ.. ప్లాన్ అదేనా..?
మరోవైపు.. 250 ఐటీ కంపెనీలు తీసుకువచ్చి ప్రత్యక్షంగా 15000 మందికి ఉపాధి కల్పిస్తానని యార్లగట్ట వెంకట్రావు తెలిపారు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ గా 12 నెలల పని చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చానన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ గన్నవరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థాయిలో తీర్చిదిద్దుతానని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం అని యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు.