వర ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీకి ఆదరణ లేనప్పుడు కష్టకాలంలో పార్టీలో చేరాన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేరలేదు.. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశాను.. దళితుడి నాయకత్వాన్ని ఓర్చుకోలేక సీఎం కుట్ర చేశారు అని ఆయన ఆరోపించారు.
ప్రజా మేనిఫెస్టోపై ఎన్డీఏ నేతలు సమావేశం అయింది. ప్రజా మేనిఫెస్టో రూప కల్పనకు ప్రజాభిప్రాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా అభిప్రాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.
పల్నాడు జిల్లాకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. చీకటీగల వారి పాలెం దగ్గర ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది.
మెగాస్టార్ చిరంజీవిని కలిసే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సుమారు 5 కోట్ల రూపాయల వరకు మెగాస్టార్ చిరంజీవి జనసేన కోసం విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అధికారాన్ని కోల్పోవడం ఖాయమని తెలిసాక వైసీపీ రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా విమర్శలు గుప్పించారు. అందుకే పిచ్చెక్కి అర్థరాత్రి సమయంలో పల్నాడు జిల్లా, క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు అని మండిపడ్డారు.
రెండు నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది.. మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండగ చేస్తాం, అన్ని పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తామని రైతన్నలను ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఉయ్యూరులో పోలికేక పెట్టినా జనం నుంచి స్పందన లేదు అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు.. చంద్రబాబు కనీసం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవాలనే ఈ పోరాటం చేస్తున్నారు.