వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు.
ఆంద్రప్రదేశ్‌లో రోజురోజుకి రాజకీయ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. పొత్తు, ప్రశ్నాపత్రాల వివాదం, ఎన్నికల వ్యూహాలు.. వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ను స్టార్ హోటల్‌గా మార్చుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు హైదరాబాద్ వదిలి ఏపీకి రారని అన్నారు. గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి చంద్రబాబు…
ఏపీ ముఖ్యమంత్రి తన టీంని మార్చే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. జిల్లాలు, కులాలు, మతాలు, విధేయత,పార్టీ పట్ల నిజాయితీ వున్నవారిని ఎంపికచేసి కొత్త కేబినెట్ కూర్పు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో బెర్త్ ఎవరికి? ఎర్త్ ఎవరికి? అంశం పైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పైన ఎవరి అంచనాల్లో వారున్నారు. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖాయం…
జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ప్రభుత్వం మారడం ఖాయం.. 151 సీట్లు వచ్చిన వైసీపీకి 15 సీట్లే రావచ్చునని పవన్ తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలుస్తుంది. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తా.. వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నా. ఏం చేస్తారో చేసుకోండి. తాటతీసి మోకాళ్ల మీద నించోబెడతా.. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటా.. కాకినాడలో మా ఆడపడుచు మీద చేయి…