రాష్ట్రాన్ని వైసీపీ కబంద హస్తాల నుంచి కాపాడాలంటే అది టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు . విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు.
నాకు టికెట్ ఇవ్వలేక పోతున్నట్టు చంద్రబాబు చెప్పమన్నారని నాకు సమాచారం ఇచ్చారని తెలిపిన బోడే ప్రసాద్.. కానీ, నేను ఏ తప్పు చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. IVRS, సర్వేలు కూడా బాగున్నా టికెట్ ఇవ్వటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఓడిపోయిన సమయంలో కూడా ఇంత బాధపడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.
జనసేన సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అనే విషయాన్ని ప్రకటించిన ఆయన అదే మీటింగ్లో అనేక విషయాలను తన పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో పంచుకున్నారు.