కృష్ణాజిల్లా గుడివాడలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్‌లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేశారు. బౌద్ధ విధానంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. అంబేద్కర్ దిక్సూచిగానే వైఎస్సార్‌సీపీ పని చేస్తుందని ఆయన తెలిపారు. గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసే మహాభాగ్యం తనకు రావడం పూర్వజన్మ సుకృతమని…
చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు. పార్టీ కండువా కప్పి సంజీవ్ కుమార్ ను సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు. నాతో సహా రాష్ట్ర ప్రజలు వైసీపీను ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని ఆయన విమర్శించారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు సంజీవ్ కుమార్. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు…
ఈ ఎన్నికల్లో.. టీడీపీ అధికారం చేపట్టి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు.
జేఎస్పీ, బీజేపీలతో సీట్ల పంపకం ఒక కొలిక్కి రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేఎస్పీ, బీజేపీలకు 31 సీట్లు కేటాయించారు. ఇప్పటికే టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో టీడీపీ 30 అసెంబ్లీ, కొన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జేఎస్పీ, బీజేపీ రెండూ తాము పోటీ చేసే స్థానాలపై…
గంటా శ్రీనివాసరావు నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్‌పై గంటా శ్రీనివాస రావు చర్చించనున్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాకు హైకమాండ్ ఆదేశం పంపింది. అయితే.. నిన్న చంద్రబాబును కలిసిన గంటా శ్రీనివాస రావు విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని కోరారు. పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలన్న హైకమాండ్ చెప్పడంతో… చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో సమావేశం తర్వాత తుది…