నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అంతా టీడీపీ మయం అయిందని.. మండలంలో ఉన్న 24 పంచాయతీల నుండి శుక్రవారం వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వరికుంటపాడు మండలంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం టీడీపీ మండల అధ్యక్షుడు చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు మహానటులు..ఒకరిని మించి మరొకరు తమ నటనతో బనగానపల్లె ప్రజలకు మాంచి యాక్షన్ కామెడీ సినిమా చూపించారని, తమ అసమర్థతను తామే ఘనంగా చాటి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు అని బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి.. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక, చంద్రబాబు కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి.. వైఎస్ జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
నేడు సీనియర్ రాజకీయ నేత, మాజీ రాష్ట్ర మంత్రి, కాపు ఉద్యమ నేతైన ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. నేటి ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షాన పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈయన గత…
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. రేపే వైసీపీ ఫైనల్ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. అంతేకాకుండా.. సీఎం జగన్ ఎన్నికల రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేపు ఇడుపులపాయకు సీఎం జగన్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. అదే రోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో జగన్…