KS Jawahar: తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది.. 94 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు 34 మందితో కూడిన రెండో లిస్ట్‌ను విడుదల చేశారు.. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేతలు, క్యాడర్.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు కేటాయించడంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సిద్ధం అవుతున్నారు. టీడీపీ రెండో జాబితా విడుదలైన తర్వాత తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు కేఎస్ జవహర్.. కొవ్వూరు అభ్యర్థిగా వెంటనే జవహర్ పేరును ప్రకటించాలంటూ ఆయన ఫాలోవర్స్ నినాదాలు చేశారు..
Read Also: TSPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కేఎస్ జవహర్.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించారు.. అభిమానుల కోరిక మేరకు అవసరమైతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తాను అని మొదట వ్యాఖ్యానించిన ఆయన.. క్యాడర్ తో మాట్లాడిన తర్వాత తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటాను అన్నారు. అంతేకాదు.. ఈ సారి పోటీ చేయటం ఖాయం.. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కేఎస్ జవహర్.