Minister Peddireddy: ఏపీ ఎన్నికల్లో పొత్తులు ఖరారు అయ్యాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయి.. అయితే, ఈ పొత్తులపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఎన్నికలకు వస్తున్నారు. బీజేపీని గతంలో చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని దుయ్యబట్టారు. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప బీజేపీ అన్ని ఇచ్చిందని చంద్రబాబు అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇచ్చిందని ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందా…? అని సెటైర్లు వేశారు. ఇక, బీజేపీ.. సీఏఏ తీసుకొచ్చి మైనార్టీలను ఇబ్బంది పెట్టాలని చూస్తుందని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: Vijay Sethupathi : విజయ్ సేతుపతిలో ఈ టాలెంట్ కూడా ఉందా?
కాగా, రాష్ట్రంలో అన్ని పార్టీలు ఓవైపు.. సీఎం జగన్ ఒక్కడు ఒకవైపు ఉన్నారు.. అన్ని పార్టీలు కలిసి కట్టకట్టుకుని వచ్చినా.. సీఎం వైఎస్ జగన్ అనే సింహం సింగిల్‌గానే వస్తుంది.. మరోసారి విజయం సాధిస్తుంది.. జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని గతంలో పెద్దిరెడ్డి వివరించిన విషయం విదితమే.. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాంమని, ఏ ముఖ్యమంత్రి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని పేర్కొన్నారు పెద్దిరెడ్డి.. గతంలో ముఖ్యమంత్రులు అది చేసే ఇది చేశామనే మాటల తప్ప పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో పేర్కొన్న విషయం విదితమే.