Rapaka and Gollapalli: రాజోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మధ్య తలెత్తిన విభేదాలు సమసిపోయాయి.. ఈ రోజు నిన్నటివరకు గొల్లపల్లి అంటేనే విభేదిస్తూ వచ్చిన ఎమ్మెల్యే రాపాక.. ఈ రోజు స్వయంగా తనకు తానే గొల్లపల్లి సూర్యారావు ఇంటికి వెళ్లి కలిశారు.. ఇక, గొల్లపల్లి సూర్యారావు గెలుపుకోసం పనిచేస్తానంటూ ప్రకటించారు రాపాక.. ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు అంతా కలిసిపనిచేద్దాం అన్నారు.
Read Also: Oral Cancer : ఓరల్ క్యాన్సర్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటంటే?
అయితే, నిన్నటి వరకు గొల్లపల్లి సూర్యారావు రాకను వ్యతిరేకించారు రాపాక వరప్రసాద్.. కానీ, వైసీపీ అధిష్టానం ఆదేశాలతో వెనక్కి తగ్గిన రాపాక.. ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు.. గొల్లపల్లి గెలుపుకోసం కృషి చేస్తానని ప్రకటించారు.. రాజోలు నియోజకవర్గంలో గొల్లపల్లి గెలుపుకోసం తో పాటు అమలాపురం పార్లమెంట్ స్థానంలో నా గెలుపు కోసం.. కలిసి పనిచేస్తామన్నారు. ఇద్దరూ కలిసి వెళ్లాలి.. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు రాపాక. ఇక, ఐదేళ్లు రాజోలు నియోజకవర్గంలో రాపాక చేసిన కృషికి ప్రమోషన్‌గా పార్లమెంట్ సీటు వచ్చిందన్నారు గొల్లపల్లి సూర్యారావు.. ఇది మన నియోజకవర్గానికి అదృష్టింగా భావిస్తున్నాను అని తెలిపారు. గత 30 ఏళ్లుగా కోనసీమ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేశాం.. మంచి పేరు తెచ్చుకున్నాం.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు గొల్లపల్లి సూర్యారావు..