కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
టీడీపీ ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబు మాట్లాడుతూ, వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితాను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.
నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కానీ, కేఏ పాల్‌కి ప్రచారం చేస్తాను అన్నారు. కేఏ పాల్ ఆహ్వానం మేరకు ప్రజాశాంతి పార్టీలో చేరాను... వైజాగ్ ఎంపీగా పాల్ పోటీ చేస్తున్నారు, ఆయనకు ప్రచారం చేస్తాను అని స్పష్టం చేశారు. పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బాబుమోహన్.
తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం ఖాయం అని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవాన్ని పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్ తో పాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఇవాళ (బుధవారం) ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని మూడు పార్టీలకు చెందిన నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని కూటమి నేతలు అంటున్నారు.