SVSN Varma: తానే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో టీడీపీ కోఆర్డినేటర్ వర్మ అభిమానులు ఆందోళనకు దిగారు.. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలు దగ్ధం చేశారు.. వర్మను టీడీపీ మోసం చేసిందని, వెంటనే పిఠాపురం నుంచి వర్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను నిర్వహించారు.. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. గెలిచే సీట్లను నాన్ లోకల్ వారికి ఎలా కట్టబెడతారని మండిపడుతున్నాయి టీడీపీ శ్రేణులు.. ఇక, ఈ పరిణామాలపై స్పందించిన పిఠాపురం తెలుగుదేశం పార్టీ కో-ఆర్డినేటర్ వర్మ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: IAS Officer: పేషెంట్‌లా ఆస్పత్రికొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
రేపు టీడీపీ కార్యకర్తలు మీటింగ్ ఏర్పాటు చేశారు.. ఆ మీటింగ్ కి నన్ను ఆహ్వానించారు.. నేను వెళ్తున్నాను అని తెలిపారు వర్మ.. కార్యకర్తలు ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకుంటాను అని వెల్లడించారు. మొత్తంగా రేపు కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు వర్మ.. నాది పిఠాపురంలో పుట్టి పెరిగిన కుటుంబం అన్న ఆయన.. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి ఈ ఆందోళనలకు సంబంధం లేదన్నారు. ఇది మా పార్టీ వ్యవహారం అందరూ సమన్వయంతో ఉండాలని పిలుపునిచ్చారు. నేను కష్టపడ్డానో లేదో ప్రజలకు తెలుసు అన్నారు. అయితే, ఎవరిపైనా అగౌరవంగా మాట్లాడవద్దు అని ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న టీడీపీ శ్రేణులకు సూచించారు పిఠాపురం టీడీపీ కో-ఆర్డినేటర్ వర్మ. కాగా, గతంలో జనసేన కో-ఆర్డినేటర్ గా వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ను వ్యతిరేకించారు వర్మ.. ఆయనతో కలిసి కార్యక్రమాలు చేయడానికి కూడా ఇష్టపడలేదు.. కానీ, పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే ఆహ్వానిస్తానని, ఆయన నియోజకవర్గానికి రాకుండానే సీటును గెలిపించి గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించారు.. కానీ, సడన్ గా సీటు లేకపోవడంతో టెన్షన్ పడుతున్నారు.. అనుచరులు మాత్రం పిఠాపురం టీడీపీ ఆఫీస్ దగ్గర రచ్చ చేశారు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు.. మరి పిఠాపురం పాలిటిక్స్ ఎలాంటి మలుపుతీసుకుంటాయో చూడాలి.