AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం అయ్యాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే అవకాశమున్న ఈ సమావేశాల్లో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం కాకపుట్టిస్తోంది.
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. చివరి రోజు జరిగిన సమావేశాల్లో మొత్తం 9 బిల్లులు ఆమోదం పొందాయి. బుధవారం మూజువాణి ఓటుతో తొమ్మిది బిల్లులను సభ ఆమోదించింది. ఈ బిల్లుల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా సవరణ బిల్లును ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి విడుదల రజినీ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ షాప్స్ అండ్…
Vidadala Rajini: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రసంగించారు. వైఎస్ఆర్ గురించి చెప్తూ ఆమె టంగ్ స్లిప్ అయ్యారు. వైఎస్ఆర్ అంటేనే తెలుగు ప్రజలకు ఆత్మీయత అని.. ఒక మానసిక భావన అని వెల్లడించారు. ఒక మనిషి శాసిస్తే గాడితప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుంది అనడానికి బదులు ‘పట్టలేకపోతుంది’ అంటూ మంత్రి విడదల రజినీ మాట్లాడారు. తడబడిన…
CM Jagan: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత 40 నెలల్లో వ్యవసాయ రంగంలో రూ.1,28,634 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. గత మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని.. సగటున 167.99 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని వెల్లడించారు. రైతు భరోసా ద్వారా 52 లక్షల 38 వేల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు. రైతు భరోసా కింద రూ.23,875…
CM Jagan: ఏపీ అసెంబ్లీలో మంగళవారం ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ప్రపంచం మారుతుంటే.. చదువులు కూడా మారుతున్నాయని.. తాము అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో 1958 కాలంలో పరిస్ధితులే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లలో మార్పులు తేవాలని సంకల్పించామని.. అందుకే అధికారంలోకి రాగానే మన బడుల్ని, పిల్లల్ని బాగు చేయాలని అనేక మార్పులు చేశామన్నారు. విద్యారంగంలో మార్పులు తెస్తే రాజకీయ దురుద్దేశం అంటున్నారని.. విద్యారంగంపై, పిల్లల చదువుపై…
Pegasus Row: ఏపీ అసెంబ్లీలో మంగళవారం నాడు పెగాసస్‌పై హౌస్ కమిటీ సభ ముందు నివేదికను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డేటా చౌర్యం వ్యవహారంపై శాసనసభకు మధ్యంతర నివేదికను ఇచ్చింది. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం సమర్పించింది. ఈ సందర్భంగా డేటా చౌర్యం వ్యవహారంపై వివరాల కోసం గూగుల్‌కు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది. స్టేట్ డేటా సెంటర్…
Andhra Pradesh: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఈ మేరకు డేటా చౌర్యం అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా పెగాసస్ అంశంపై కమిటీ నివేదికను పెగాసస్ హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. చంద్రబాబు హయాంలో డేటా చౌర్యం జరిగిందని తాము నిర్ధారించినట్లు భూమన తెలిపారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ సభ ముందుకు పెగాసస్ కమిటీ నివేదిక…
CM Jagan: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయని.. ఆ పార్క్ మనకు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. కానీ ఆ పార్కు వద్దని కేంద్రానికి టీడీపీ లేఖ రాసిందని జగన్ ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదని.. రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లతో డ్రగ్ పార్క్ వస్తుంటే టీడీపీ…