AP Assembly: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే హీట్ పెంచాయి.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. చర్చకు పట్టుబట్టడం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. ప్రతిగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకురావడం.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో స్పీకర్ సభను వాయిదా వేయడం జరిగిపోయాయి.. అయితే, వాయిదా తర్వాత సభ తిరిగి ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు మళ్లీ ఆందోళన దిగారు.. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టకుండా మార్షల్స్ ఏర్పాటు చేయగా.. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లటానికి మార్షల్స్ ను నెట్టే ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యులు.. ఇక, సభలో గందరగోళ పరిస్థిలు ఏర్పడడంతో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
అనగాని ప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావు కేశవ్‌ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయగా.. మిగతా టీడీపీ సభ్యులను అందరినీ ఒక రోజు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాబీల్లో కూడా నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. సభ లోపల ఫోన్లలో వీడియో తీశారు టీడీపీ సభ్యులు పయ్యావుల, ఉండి ఎమ్మెల్యే రామరాజు… స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.. సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.. సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.. బెందాళం అశోక్- బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. మరోవైపు.. సభలో మీసాలు మెలేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను హెచ్చరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. మొదటి తప్పు గా పరిగణిస్తున్నాం.. పునరావృతం చేయవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!