CM Jagan: ఏపీ ఆర్ధిక వ్యవస్థపై అసెంబ్లీలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నా ఏపీ గణనీయంగా వృద్ధి సాధించిందని వెల్లడించారు. అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందని దుష్ప్రచారం కూడా చేస్తున్నారని.. రుణాలకు వడ్డీల కింద రూ. 21,499 కోట్లు, రుణంగా రూ. 14,558 కోట్లు చెల్లించామని సీఎం జగన్ వివరించారు. అలాగే రాష్ట్ర రెవెన్యూ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి…
రెండో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వాడీవేడీగా సాగిన సమావేశాలు.. మూడు రాజధానుల వ్యవహారం అసెంబ్లీలో కాకరేపింది.. ఇక, రెండో రోజు కూడా రసవత్తరమైన చర్చ జరగనుంది.. ఇవాళ ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది..
బీఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి ఆఫర్ ఇచ్చారు.. మీరు ఏ అంశం కావాలన్న చర్చకు మేం రెడీ.. సభలో చర్చకు సహకరిస్తారా..? లేదా..? అని ప్రశ్నించారు..
ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి... ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు.. ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ, పది గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతుంది..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి.. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.. ఇక, చివరిసారిగా జులై 19 నుంచి ఐదురోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.. అయితే, ఈ సారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు రావాలి కోరారు ప్రభుత్వ చీఫ్ విప్…
అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు… ఈ సారి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు… ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.. ఈ నెల 24వ…
చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా ఎలా మారుస్తారు..? అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మండిపడ్డారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చారన్న ఆయన.. 1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదన్నారు.. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చే లేదు.. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలా..? పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరితే అరెస్టులు…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం కొనసాగనున్నాయి. ఈరోజు బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ జరగనుంది. అటు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల బిల్లుతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ పెంపు బిల్లు, మద్యం అమ్మకాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాల తీర్మానంపై జరిగే చర్చలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా అసెంబ్లీలో నేడు జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ వాయిదా తీర్మానం…
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వాయిదా పడనుంది శాసన సభ. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై…
ఈ నెల 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై మల్లగుల్లాలు పడుతూ వచ్చిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది.. మొదట పొలిట్‌బ్యూరో సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌ను వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా… ఇవాళ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మాత్రం సభకు వెళ్లేందుకే…