గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో చంద్రబాబు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై వ్యూహాం పై చర్చించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తు న్న పనులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. టీడీపీ ప్రతిపాదించిన 27 అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనిపై ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీయాలని…
ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయాన్ని పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నెల 26 వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరుపాలని టీడీపీ డిమాండ్ చేసింది.. కేవలం వారం రోజుల పాటు పొడగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే.. కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ.. అసెంబ్లీ…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్ పెట్టింది సర్కార్.. అసెంబ్లీ ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ప్రభుత్వం.. ఒకే రోజున 14 ఆర్డినెన్సులను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.. ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌లు: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌ల…
బడ్జెట్ సమావేశాలకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈనెల 20వ తేదీన ఒకేరోజు సభ నిర్వహించనున్నారు. అయితే, ఒకేరోజు సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలపై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, మెజార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించడమే మంచిదని పార్టీ చీఫ్‌కు తెలియజేశారు.. కోవిడ్‌తో సహా అనేక సమస్యలతో రాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారని.. కేసులు, ఇతర…