అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని…
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన…
ఏపీలో 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. అంతేకాకుండా నేటికి విచారణను వాయిదా వేసింది. దీంతో నేడు విచారణకు హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ విషయంపై అత్యవసరంగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించి 3…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో మొదటి ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కోరడంతో దానిపై వైసీపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే రెండవ రోజు ఉద్రిక్తతల నడుమ సాగిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం నిర్వహించనుంది.…
ఈ నెల 18న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభలో తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలోనే సభలో అడుగుపెడుతానంటూ శపథం చేశారు. అనంతరం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలకు మూడోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఇవాళ్టి నుంచి ప్రశ్నోత్తరాల సమయాన్ని అసెంబ్లీ చేపట్టనుంది. సభ ముందుకు ఏపీ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్…
ప్రజాస్వామ్యంలో చట్ట సభలే దేవాలయాలు. ఒకప్పుడు వాటి పట్ల ప్రజలకు ఎంతో గౌరవం. కాని నేడు చట్ట సభల సమావేశాల తీరు మారింది. ప్రతిష్ట మసకబారింది. గౌరవ సభలు కాస్తా కౌరవ సభలు అవుతున్నాయి. చట్టసభల్లో మటలు హద్దులు హద్దులు దాటుతున్నాయి. హూందాగా సాగాల్సిన సమావేశాలు జుగుప్సాకర స్థాయికి దిగజారాయి. రాజకీయాలతో సంబంధం లేని వారిని, కుటుంబ సభ్యులను ఈ రొచ్చులోకి లాగి సమావేశాలంటేనే వెగటుపుట్టేలా చేస్తున్నారు. వారు వీరు అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా…
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై హీరో కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతో బాధాకరం. ఇది…
ఏపీలో నిరసన జ్వాలలు చెలరేగాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత తనను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపిస్తూ సభను బయటకు వచ్చేశారు. అనంతరం తన ఛాంబర్ టీడీఎల్సీ సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. తమ అభిమాన నేత ఇలా కన్నీరు పెట్టుకోవడాన్ని చూసిన టీడీపీ శ్రేణులను ఆవేదన గురి చేసింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు నిరసన, ఆందోళనకు దిగారు.…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మొదటి సభలోకి చంద్రబాబు రాకపోవడంతో కుప్పం ఫలితాల కారణంగా రాలేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబును సభలోకి ఆహ్వానించారు. అయితే వైసీపీ మంత్రి కొడాలి నాని సభలో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై చర్చించడానికి టీడీపీ ధైర్యం లేదని.. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నామని వేరే…